Pages

Macbook Pro

Thursday, 10 December 2015

తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట...అధికారిక చిహ్నాలుగా జింక,తంగేడు,జమ్మి

తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట...అధికారిక చిహ్నాలుగా జింక,తంగేడు,జమ్మి


తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్టిను ఎంపిక చేశారు. రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. సచివాలయంలో వీటిని అధికారికంగా వెల్లడించారు. ఈ చిహ్నాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్క్రృతిని ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. చరిత్ర, పౌరాణిక నేపథ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర చిహ్నాల్ని ఎంపిక చేశామని కెసిఆర్ అన్నారు. 
పాలపిట్ట - లంకపై దండయాత్ర చేసే సమయంలో రాముడు పాలపిట్టను సందర్భించుకోవడం వల్ల విజయం సాధించారని పౌరాణిక గాథలు చెబుతున్నాయి. దసరా రోజున తెలంగాణ సంస్క్రృతిలో భాగంగా పాలపిట్టను సందర్శించుకోవడం శుభసూచకంగా భావిస్తారు. 
జింక - అత్యంత సున్నితమైన అమాయకమైన అడవీ ప్రాణిగా పేరున్న జింక తెలంగాణ ప్రజల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది. 
జమ్మి చెట్టు - పాండవులు అజ్ఞాతవాసంలో ఆయుధాలను ఈ చెట్టుపైనే భద్రపరిచారని, ఆ తర్వాత దీనికి పూజలు చేసి ఆయుధాలు తీసుకెళ్లి యుద్ధంలో గెలిచారని పురాణ గాథలు చెబుతున్నాయి. అధిక సంఖ్యాకులైన కౌరవులను ఓడించడంలో తక్కువ సంఖ్యలో ఉన్న పాండవులను జమ్మి చెట్టు నుంచి శక్తి, ఆశీర్వాదం లభించాయి. దసరా రోజున జమ్మికి పూజలు చేసి ఆకులను తీసుకెళ్లడం తెలంగాణలో ఆనవాయితీ. 
తంగేడు - అడవిలో సహజసిద్ధంగా పెరిగే తంగేడు పువ్వు ప్రకృతికే అందాన్ని తెస్తుంది. తంగేడు పూలను ఆడపడుచులు తమ సౌభాగ్యాన్ని కాపాడే విశిష్టపుష్పంగా భావిస్తారు. 

No comments:

Post a Comment

Ebay.com